![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్-9 లో గత వారం నుండి కెప్టెన్సీ టాస్క్ లు పెడుతున్నాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా పవర్ కార్డ్స్ ని కంటెస్టెంట్స్ పొందాలి వారికి బెనిఫిట్స్ ఉంటాయంటూ బిగ్ బాస్ చెప్పాడు.
పవర్ కార్డ్స్ పొందడం కోసం బిగ్ బాస్ ఇచ్చిన ఛాలెంజ్ హంగ్రీ హిప్పో. గార్డెన్ ఏరియాలో బాగా ఆకలితో ఉన్న ఒక హిప్పో ఉంది.. దానికి సమయానుసారం ఆకలి వేసినప్పుడల్లా సౌండ్ చేస్తూ ఉంటుంది.. ఆ సమయంలో హౌస్‌లో ఉన్న వేరు వేరు ప్రదేశాల్లో ఆ హిప్పో ఆకలి తీర్చడానికి కావాల్సిన బాల్స్ దొరుకుతాయి.. హిప్పో సౌండ్ చేసినప్పుడల్లా పోటీదారులు హౌస్‌లో వేరు వేరు ఏరియాల్లోకి వెళ్లి అక్కడ ఉన్న బాల్స్‌ని వెతికి వాటిని తీసుకొచ్చి హిప్పో నోటిలో వేసి ఆహారంగా తినిపించాలి.. ఈ ఛాలెంజ్ ముగిసే సమయానికి ఏ టీమ్ సభ్యులైతే హిప్పో నోటిలో ఎక్కువ బాల్స్ వేసి దాని ఆకలి తీరుస్తారో ఆ టీమ్ సభ్యులు ఈ ఛాలెంజ్ విజేతలు అవుతారు.. వారికి నచ్చిన ఒక పవర్ కార్డ్‌ని పొందుతారు. ఈ ఛాలెంజ్‌లో పోటీదారులు తాము తీసుకున్న బాల్‌ని విసరడానికి వీల్లేదు.. తీసుకున్న బాల్స్‌ని కేవలం మీ చేతులతోనే మీ ఇతర టీమ్ సభ్యులకి పాస్ చేయాల్సి ఉంటుంది.. హిప్పో సౌండ్ చేసినప్పుడల్లా కేవలం ఒక బాల్ మాత్రమే లభిస్తుంది.. పోటీదారులు బాల్ తీసుకొని ఆరెంజ్ లైన్ దాటిని తర్వాత ఆ బాల్స్‌ని ఎవరూ తాకడానికి వీల్లేదు.. ఈ ఛాలెంజ్‌కి భరణి మీరు సంచాలకులాంటూ బిగ్‌బాస్ చెప్పాడు. బ్లూ టీమ్ (తనూజ, రీతూ, హరీష్), ఎల్లో టీమ్ (సంజన, రాము, సుమన్ శెట్టి), రెడ్ టీమ్ (ఇమ్మూ, కళ్యాణ్, ఫ్లోరా) లు ఈ ఛాలెంజ్‌లో బరిలోకి దిగాయి. గ్రీన్ టీమ్ రేసు నుంచి కిక్ ఔట్ అవ్వడంతో తప్పుకుంది.
అయితే ఈ టాస్క్ లో ఎల్లో టీమ్ లో ఉన్న సంజన వారికి సపోర్ట్ చేయకుండా రెడ్ టీమ్ కి సపోర్ట్ చేసింది. దాంతో సుమన్ శెట్టి ఎందుకు మేడమ్ అలా అని అడిగాడు. దానికి సంజన చెప్పిన సమాధానం విని సుమన్ శెట్టికి ఏం చేయాలో అర్థం కాలేదు. మన టీమ్ కంటే వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారని, మనం ఎలాగు గెలవలేం కదా అని అంది. ఒకే కానీ మన టీమ్ కూడా గెలవాలి కదా.. అందరు మన వాళ్ళే కానీ ఈ గేమ్ వరకు మనం ఎల్లో టీమ్.. మనం గెలవాలి మేడమ్ అంటు సంజనకి అర్థమయ్యేలా చెప్పాడు. కానీ తను అసలు వినలేదు. సుమన్ శెట్టి టాస్క్ లో బాగా ఆడినా ఫలితం లేకుండా పోయింది.
![]() |
![]() |